ఆపదలో మహిళల‘దిశ’మారుస్తుంది..
Ens Balu
4
నెల్లిపూడి
2021-07-06 15:02:04
ఆపద సమయంలో మహిళల దిశను మార్చేదే దిశ మొబైల్ యాప్ అని అన్నవరం ఎస్.ఐ రవికుమార్ పేర్కొన్నారు. మంగళవారం శంఖవరం మండలం నెల్లిపూడి గ్రామసచివాలయంలో మహిళలకు దిశ యాప్ పై ప్రత్యేక అవగాహన, ఇనిస్టాలేషన్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, దిశ యాప్ ప్రతి మహిళ చేతిలో ఒక పెద్ద శక్తి అనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించాలన్నారు. అనంతరం దిశ యాప్ ఏ విధంగా వినియోగించాలి, దాని వలన ఉపయోగాలేంటి అనే విషయాన్ని మహిళా పోలీస్ కళాంజలి వివరించారు. అంతేకాకుండా మహిళలు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయడానికి ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. వాలంటీర్లు, మహిళా ఉద్యోగులు కూడా ఈ యాప్ ను ఖచ్చితంగా ఇనిస్టాల్ చేసుకోవాలన్నారు. ఈ కార్యకర్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరాల శ్రీనివాసరావు, కార్యదర్శి కె.శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది, అధిక సంఖ్యలో మహిళలు, పోలీసులు పాల్గొన్నారు.