గ్రామాభి వ్రుద్ధిలో భాగస్వాములు కావాలి..


Ens Balu
2
Sankhavaram
2021-07-07 13:11:47

గ్రామాభివ్రుద్ధిలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు మరింత భాగస్వామ్యం కావాలని ఉపసర్పంచ్ కుమార్, కార్యదర్శి రామచంద్రమూర్తిలు సూచించారు. బుధవారం శంఖవరం గ్రామసచివాలయం-1లో 3 సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్సార్ రాజశేఖరరెడ్డి జయంతి, రైతు దినోత్సవాల కార్యక్రమాలను రేపు వివజయవతం చేయాలన్నారు. అంతేకాకుండా  ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో గ్రామ సచివాలయాల నూతన భవనాల ప్రారంభోత్సవంలోనూ అందరూ పాల్గొనాలన్నారు. రేపటి నుంచి కొత్త సచివాలయాల ద్వారా పేదలందరికీ గ్రామంలోనే పూర్తిస్థాయిలో సేవలందించాలని కోరారు. కార్యదర్శి మాట్లాడుతూ, ప్రభుత్వం సచివాలయం ద్వారా అందించే సేవలను ప్రజలకు వాలంటీర్లు పూర్తిస్థాయిలో తెలియజేయాలన్నారు. రేపటి కార్యక్రమాల్లో వాలంటీర్లు, ప్రజలు మాస్కులు ధరించి, బౌతిక దూరం పాటిస్తూ..కార్యక్రమాల్లో పాల్గొనాలని కార్యదర్శిలు శంకరాచార్యులు, సత్యలు కోరారు. సచివాలయాల్లోని సిబ్బంది వారి సేవలకు సంబంధించిన రికార్డులను అప్డేట్ చేసుకొని సిద్దంగా ఉంచుకోవాలన్నారు. ఈ సమావేశంలో మహిళా పోలీసు జీఎన్ఎస్ శిరీష, గ్రామ పెద్దలు పడాల సతీష్, పడాల భాషా,అడపా వీరబాబు, వైరాశ్రీరామ్మూర్తి, పడాల బుజ్జి, సచివాలయ వాలంటీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
సిఫార్సు