మహిళల రక్షణకోసం దిశయాప్ వాడాలి..


Ens Balu
3
Sankhavaram
2021-07-07 13:19:12

ఆపదలో వున్న మహిళలకు సహాయం అందించాలనే మంచి సేవాభావం వున్న పురుషులు కూడా దిశ యాప్ వినియోగించవచ్చునని మహిళా పోలీస్ జిఎస్ఎస్ శిరీష సూచించారు. బుధవారం శంఖవరం గ్రామసచివాలయం-1లో ఉపసర్పంచ్ కుమార్, కార్యదర్శి రామచంద్రమూర్తిలు, 3 సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లతో  సమీక్షా సమావేశంలో దిశ యాప్ పై అవగాహన కల్పించారు. ప్రతీ మహిళ సెల్ ఫోనులో దిశయాప్ ఇనిస్టాల్ చేసుకోవడం ద్వారా ఎంతో రక్షణ పొందవచ్చునన్నారు. చాలా మంది యువత ఇపుడు దిశ యాప్ ఇనిస్టాల్ చేసుకొని మహిళల కోసంప్రభుత్వం రూపొందించిన ఈ దిశ యాప్ పై తమవంతుగా ప్రచారం చేస్తున్నారన్నారు. ఉపసర్పంచ్, కార్యదర్శిలు మాట్లాడుతూ, మహిళా వాలంటీర్లంతా దిశ యాప్ ని మహిళలు, కాలేజీలకు వెళ్లే విద్యార్ధినిలు, ఇళ్లల్లో వుండే మహిళల ఫోన్లలో కూడా ఇనిస్టాల్ చేయించి..యాప్ ఉపయోగాలు తెలియజేయాలన్నారు. ఏరోజు ఎంతమందితో యాప్ ఇనిస్టాల్ చేయించారో కూడా మహిళా పోలీసుకి సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈ సమావేశంలో మహిళా పోలీసు జీఎన్ఎస్ శిరీష, గ్రామ పెద్దలు పడాల సతీష్, పడాల భాషా,అడపా వీరబాబు, వైరాశ్రీరామ్మూర్తి, పడాల బుజ్జి, సచివాలయ వాలంటీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
సిఫార్సు