రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వినూత్న గ్రామ సచివాలయ విధానంతో ప్రజల సమస్యలను గ్రామంలోనే పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ జి.మురళీధరరెడ్డి అన్నారు. శంఖవరం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన గ్రామసచివాలయం-2 భవానాన్ని ఎంపీగీత, ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్రప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఒకప్పుడు ఏదైనా ఒక ధ్రువీకరణ పత్రం కావాలంటే ప్రజలు మండల, జిల్లా కేంద్రాలకు రావాల్సి వచ్చేదన్నారు. అలాంటిది గ్రామసచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తరువాత ఏకంగా 745 సేవలు గ్రామంలోనే అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ఒకేరోజు ఒకే ప్రాంతంలో మూడు గ్రామసచివాలయ భవనాలను డా.వైఎస్సార్ జయంతిరోజున ప్రారంభించడం ఆనందంగా వుందన్నారు. ఎంపీ వంగా గీత మాట్లాడుతూ, ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి ఈ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. ఎమ్మెల్యే పర్వతశ్రీపూర్ణచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజలకు శాస్వతంగా సేవలందించడానికి ఏర్పాటు చేసిన ఎంతో అమూల్యమైన వ్యవస్థ గ్రామ, వార్డు సచివాలయ విధామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మల్లిబాబు, ఎంపీపీ అభ్యర్ధి పర్వత రాజబాబు, తహశీల్దార్ సుబ్రమణ్యం, ఎంపీడీఓ రాంబాబు, గ్రామ ఉప సర్పంచ్, కుమార్, కార్యదర్శి రామచంద్రమూర్తి, జానియర్ అసిస్టెంట్ రమణమూర్తి, గ్రామ ఉప సర్పంచ్, చింతంనీడి కుమార్, వైఎస్సార్సీపీ నాయకులు పర్వత సత్యన్నారాయణమూర్తి, కొండమూరి చంటిబాబు, సర్పంచ్ బందిలి చిన్నయ్యమ్మ, మండల మేనేజర్ పడాల సతీష్, పడాల బాషా,బిసి కార్పోరేషన్ డైరెక్టర్ కిల్లి పార్వతి, కార్యకర్తలు మూడు సచివాలయాల కార్యదర్శిలు, వీఆర్వోలు, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, సచివాల సబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.