తెలుగు ప్రజల ఆరాధ్య దైవం దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్సార్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ ముందడుగు వేయాలని క్రిష్ణదేవిపేట సర్పంచి పందిరి సత్యన్నారాయణ పేర్కొన్నారు. గురువారం వైఎస్సార్ జయంతి సందర్భంగా గ్రామంలోని ఆయన విగ్రహానికి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు, పంచాయతీ వార్డు సభ్యులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, వైఎస్సార్ జన్మదినోత్సవం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక పెద్ద పండుగలాంటిదన్నారు. వైఎస్సార్ కలలుగన్న గ్రామ స్వరాజాన్ని ముఖ్యమంత్రి గ్రామసచివాలయాలను ప్రజల ముందుకు వినూత్న వ్యవస్థగా ముందుకి తెచ్చారని కొనియాడారు. నేడు గ్రామంలోనే అన్నివర్గాల ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంసీ పందిరిబుజ్జి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు చుక్కల సత్యన్నారాయణ, కరక చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు.