దిశ యాప్ మహిళల జీవితంలో భాగస్వామ్యం కావాలని మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష పేర్కొన్నారు. శుక్రవారం శంఖవరం మండల కేంద్రంలోని గ్రామసచివాలయం2, 3 లలో వాలంటీర్లకు దిశ యాప్ మరింత మందికి ఏ విధంగా చేర్చాలనే విషయమై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ శిరీష మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, విద్యార్ధిని రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఈ యాప్ ను ప్రతీఒక్కరూ వారి ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇనిస్టాల్ చేసుకోవాలన్నారు. దిశ యాప్ కోసం తెలియనివారికి స్వచ్చందంగా వాలంటీర్లు అవగాహన కల్పించాలన్నారు. మహిళల జీవితానికి రక్షణ దిశ యాప్ ఉండేలా పోలీస్ శాఖ దీనిని అందుబాటులోకి తీసుకు వచ్చిందన్నారు. గ్రామ వాలంటీర్లు ప్రతీరోజూ వారి సచివాలయ పరిధిలోని ఎక్కువ మందితో ఈ యాప్ ఇనిస్టాల్స్ చేయించడంతోపాటు, గ్రామంలో కూడా ఇంటి దగ్గర ఉండే మహిళలకు చైతన్యం కల్పించాలన్నారు. తక్కువ సమయంలో యాప్ ఎక్కువ మందితో ఇనిస్టాల్స్ చేయించిన వాలంటీర్లను మహిళా పోలీస్ ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ వాలంటీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.