కోవిడ్ సమయంలో ఉపాధి కోల్పోయి బ్రతుకు జీవనం కొనసాగిస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులను గుర్తించి వారికి సహాయం అందించడం ఆదర్శనీయమని ఎంపీడీఓ డివిఎస్ పద్మిని అన్నారు. శనివారం కామవరపు కోట ఆర్ అండ్ బి బంగ్లా వద్ద యాంటీ కరోనా హెల్పింగ్ టీం ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం నిత్యావసర సరుకులు కూరగాయలు 11 మంది ప్రైవేటు ఉపాధ్యాయులకు ఎంపీడీవో అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత మూడు నెలలుగా యాంటీ కరోనా హెల్పింగ్ టీం సభ్యులు ఎంతో మానవతా ద్రుక్పదం.. దాతల సహాయ సహకారాలతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందించదగ్గ విషయమన్నారు. మరింత మంది దాతలు ముందుకొచ్చి ఉపాది కోల్పోయిన వారికి తమ వంతుగా సహాయ సహకరాలు అందించాలని ఎంపీడీఓ పిలుపునిచ్చారు. సిపిఐ నాయకులు టీవీఎస్ రాజు హెల్పింగ్ టీం సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ టీం సభ్యులు వీరమల్ల మధు, నిజాపరపు దుర్గాప్రసాద్, మున్నంగి శ్రీనివాస్, వీరమల్ల సౌజన్ సాయి, వీరంకి రాటాలు, ప్రైవేటు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.