దారకొండ ఆలయ అవకతవకలపై ఏసి కె.శాంతి దర్యాప్తు..
Ens Balu
7
Darakonda
2020-09-02 17:52:14
విశాఖ జిల్లా దారకొండ దారాలమ్మ అమ్మవారి దేవస్ధానంలో అవకతవకలు జరిగినట్లు దేవాదాయశాఖ అధికారులు గుర్తించారు. భక్తుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదు లు రావడంతో బుధవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులను, దేవాలయం కమిటీ సభ్యులను, అర్చకుడిని, దేవాలయ ఉద్యోగులను దేవాదాయశాఖ సహాయ కమిషనర్ కె.శాంతి విచారించారు. హుండీ ద్వారా వచ్చే ఆదాయం, భక్తులకు ఇచ్చే వసతి గృహాల అద్దెలు, గుడి ప్రాంగణంలోని దుకాణాల అద్దెలు ఏమ వుతున్నాయని, ఎవరెవరు ఈ ఆదాయాన్ని స్వాహాచేస్తున్నారు అనే విషయాలపై విచారణ చేశారు. జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారు. తమ మొక్కులు చెల్లించుకుంటుంటారు. నిత్యం రద్దీగా ఉండే ఆలయం నిర్వహణపై భక్తులు దేవాదాయశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆధారాలు ఆధారంగా నింధితులపై చర్యలు తీసుకుంటామని సహాయ కమిషనర్ శాంతి వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ తో పాటు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.