మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి దంపతులు పాయకరావుపేట లోని నక్కపల్లి మండలం ఉపమాక శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శనివారం పాయకరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు గొల్ల బాబురావు జివిఎంసి మేయర్ దంపతులను సాదరంగా ఆహ్వానించి స్వామి దర్శనం చేయించారు. ఆలయ పూజారులు స్వామి దర్శనం అనంతరం మేయర్ దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఉపమాక వెంకటేశ్వర స్వామి దర్శనం మాకు ఎంతో సంతోషాన్నిచ్చిందని, విశాఖ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, విశాఖ అభివృద్ధి చెందాలని ఆ దేవుడిని ప్రార్థించామని మేయర్ తెలిపారు. ఈ పర్యటనలో స్థానిక జడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్ లైన వీసం రామకృష్ణ, గొర్ల బాబురావు, తాతా రావు, డిఎల్ చందర్రావు తదితరులు పాల్గొన్నారు.