పనితీరు మెరుగు పరుచుకోవాలి..


Ens Balu
4
Doranala
2021-07-13 11:02:27

గ్రామ సచివాలయంలోని సిబ్బంది, వాలంటీర్లు పనితీరును మెరుగుపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం దోర్నాల మండలంలోని దోర్నాల 2, 3 సచివాలయాలను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ రెండు సచివాలయాలలో సిబ్బంది హాజరు పట్టిక వాలంటీర్ల హాజరు పట్టికలో ఆయన నిశితంగా పరిశీలించారు. దోర్నాల-2 సచివాలయంలో రెండు నెలల నుంచి వాలంటీర్లు హాజరు పట్టికలో హాజరు నమోదు చేయకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  వాలంటీర్లు సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని ఆయన గుర్తించి విచారించాలని ఎం పీ డీ వో ను కలెక్టర్ ఆదేశించారు. విధి నిర్వహణలో లోపాలు ఉండడంపై సంబంధిత సచివాలయం పంచాయతీ కార్యదర్శికి షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఆయన చెప్పారు. సచివాలయంలోని సిబ్బంది, వాలంటీర్లు పనితీరు మెరుగుపరుచుకోకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. సచివాలయం సిబ్బంది కూడా సగంమంది సచివాలయంలో లేకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. హాజరు పట్టికలో సంతకాలు చేసిన తదుపరి ఎందుకు వెళ్తున్నారని సిబ్బందిని ఆరా తీశారు. సరిగా నిర్వహించక పోవడంపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలు మాస్క్ ధరించకుండా దోర్నాల మండలంలో సంచరిస్తుంటే కనీసం అవగాహన కార్యక్రమాలు చేపట్టడంలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. హాజరు పట్టికలో సంతకాలు లేకుండా విధులు నిర్వహిస్తున్నామని తెలిపే వాలంటీర్లకు వేతనాలు ఇచ్చేది లేదని కలెక్టర్ చెప్పారు. అధికారులు నిరంతరం సచివాలయాల ను తనిఖీ చేయాలని ఆర్డిఓ ఎంపీడీవోలను కలెక్టర్  ఆదేశించారు.
        కోవిడ్ నిబంధనలు పాటించేలా ప్రజలను చైతన్య పరచాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. దోర్నాల మండలం యడవల్లి గ్రామాన్ని సచివాలయాన్ని, పెద్దారవీడు దేవరాజు గట్టు గ్రామ సచివాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది, వాలంటీర్ల హాజరు పట్టికలు, అనుబంధ దస్త్రాలను ఆయన పరిశీలించారు. వాలంటీర్ వాలంటీర్ ల పనితీరు సిబ్బంది పనితీరు పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని ఆయన పలు సూచనలు చేశారు. ముఖ్యంగా సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వై ఎస్ ఆర్ హెల్త్ క్లినిక్ ల భవన నిర్మాణాలు పరిశీలించాలని ఆయన చెప్పారు. వేగంగా పూర్తయ్యేలా నిరంతర పరిశీలన ఉండాలని ఆయన తెలిపారు. ఆయన వెంట మార్కాపురం ఆర్ డి వో లక్ష్మిశివజ్యోతి, దోర్నాల ఎంపీడీవో మౌలాలి, తదితరులు ఉన్నారు.
సిఫార్సు