జోరు వానలో పీఓ కాలినడన పర్యటన..


Ens Balu
4
Salur
2021-07-13 11:33:26

సాలూరు మండలం మామిడి పల్లి గ్రామ సచివాలయాన్ని ఐ.టి.డి.ఎ పీఓ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ముందుగా సచివాలయంలో అందిస్తున్న సేవలు, ఉద్యోగి వారీగా సంక్షేమ పథకాల అమలు పై ఆరా తీశారు. వై. ఎస్.ఆర్.భీమా, చేయూత తదితర సంక్షేమ పథకాల అమలు, సచివాలయాల  ద్వారా ఇ - సేవకు, స్పందనకు వచ్చిన వినతులు పరిష్కారం తదితర అంశాలపై సమీక్షించారు.  అనంతరం పీఓ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రతి లబ్ధిదారునికి అందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. సచివాలయం సిబ్బంది సమయపాలన తప్పక పాటించాలని, కార్యాలయ వేళల్లో తప్పనిసరిగా కార్యాలయంలో అందుబాటులో ఉండాలన్నారు. సచివాలయం నుంచి బయటకు వెళ్లాల్సి వుంటే తప్పక మూమెంట్ రిజిస్టరు నమోదు చేయాలని పేర్కొన్నారు.  అనంతరం పీఓ విపరీతమైన వాన పడుతున్న లెక్క చేయక నేరెళ్ళవలస నుంచి ఎగువసింభీ  గ్రామం వరకు నడుచుకుంటూ వెళ్లి ఎగువ శింభి గ్రామంలో నిర్వహిస్తున్న గ్రామ సభలో పాల్గొన్నారు, ముందుగా గ్రామంలో ప్రభుత్వ పథకాలు సకాలంలో అందుతున్నాయా అన్న వివరాల పై ఆరా తీశారు. ఆర్.ఓ.ఎఫ్.ఆర్ భూములు కావాలని, అలాగే అంగన్ వాడి భావన కావాలని, ఆర్హులైన వారం ఉన్నాం మాకు పెన్షన్లు మంజూరు చేయమని కోరారు.   అనంతరం ప్రోజెక్ట్ అధికారి మాట్లాడుతూ  ఎగువ శింభి, దిగువ సింభి, ఎగువ గంజాయి భద్ర, దిగువ గంజాయి భద్ర, ధూళి భద్రా గ్రామాలకు చెందిన సుమారు 400 మంది అర్హతకలిగిన లబ్ధిదారులకు నెల రోజులలో పోడు పట్టాలు అందజేస్తామని తెలిపారు.  అంతే కాకుండా ఉద్యాన పంటలపై గిరిజనులకు అవగాహన కల్పించి వారికి జీడి మొక్కలు అందజేయడం జరుగుతుంది అన్నారు. పాఠశాలలు ప్రారంభం కానున్నయని పాఠశాలల్లో పిల్లలకు చేర్పించండి వారికి వసతి గృహం కల్పించి వారికి అమ్మవడి, విద్యా కానుక అందజేయడం జరుగుతుంది అన్నారు. గ్రామాల్లో అర్హులైన వారి పెన్షన్ కొరకు దరఖాస్తు చేసుకుంటే తదుపరి చర్యలు తీసుకొని మంజూరుకు చర్యలు చేపడతామన్నారు. అలాగే ఎగువసింభిలో  అంగన్వాడీ భవనం, నేరెళ్ళ వలసలో సంత షెల్టర్లు త్వరలోనే నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు. ఈ పర్యటనలో పార్వతీపురం డి. ఎస్.పి సుభాష్, సాలూరు సి. ఐ, ఎం.పి.డి.ఓ, ట్రైబల్ వెల్ఫేర్ డి.ఈ,  రెవెన్యూ , సచివాలయం అధికారులు సిబ్బంది, చుట్టు ప్రక్కల గ్రామాల గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు