తూర్పుగోదావరి జిల్లాలో దిశ యాప్ రిజిస్ట్రేషన్లలో శంఖవరం మొదటిస్థానంలో నిలబ డేవిధంగా వాలంటీర్లంతా దిశ యాప్ అందరి మొబైల్స్ లో రిజిస్ట్రేషన్ చేయించాలని వైఎస్సార్సీపీ నియకులు, ఉప సర్పంచ్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం గ్రామ సచివాలయం-1లో మూడు సచివాలయాల పరిధిలోని వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ మాట్లాడుతూ, రాష్ట్రప్రభుత్వం మహిళల రక్షణ కోసం ప్రవేశ పెట్టిన దిశ యాప్ ఆగ, మగ తారతమ్యం లేకుండా అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ముఖ్యంగా మహిళల ఫోన్లలో ఈ యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వలన ఎంతో భద్రత వుంటుందన్నారు. యాప్ ఇనిస్టాల్స్ విషయంలో ఇప్పటికే ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ప్రత్యేక సూచనలు చేశారన్నారు. ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ గ్రామవాలంటీర్లు దిశ యాప్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమం చేపట్టాలన్నారు. త్వరలోనే మండల కేంద్రంలో అన్నవరం స్టేషన్ ఎస్ఐ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మూడు సచివాలయాల కార్యదర్శిలు రాంబాబు, శంకరాచార్యులు, సత్య, మహిళాపోలీస్ జిఎన్ఎస్ శిరీష, జూనియర్ సహాయకులు రమణమూర్తి, వైఎస్సార్సీపి నాయకులు పడాల సతీష్, పడాల భాషా, సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.