గ్రామ సచివాలయాల నిర్వహణతీరును మరింతగా మెరుగుపర్చాలని జిల్లా కలెక్టరు డి. మురళీధర్ రెడ్డి గ్రామ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. గురువారం రామంద్రాపురం మండల పరిధిలోని ఓదూరు, నరసాపురపుపేట గ్రామాలలోని గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా సందర్శించి పనితీరును పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సచివాలయాలలో నవరత్నాలు వివిధ సంక్షేమ పధకాలకు సంబందించిన గోడ పత్రికలు, ప్రదర్శన బోర్డులులో ఏవిధంగా ఆయా పధకాలను వినియోగించుకోవాలన్న వివరాలు స్పష్టంగా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని పధకాలకు సంబందించిన వివరాలు ప్రదర్శింపజేయాలని ఆదేశించారు. సర్వీసు రిక్వస్టులు గడువు దాటకుండా నిర్దేశిత కాలవ్యవధిలోని పరిష్కరించాలని ఆదేశించారు. ఆయన తనఖీలో కొన్ని సర్వీసులు పెండిరగు ఉండటాన్ని గమనించి వెంటనే వాటిపరిష్కారానికై ఆయా శాఖలకు నివేదించి పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రతి అర్జీని క్రమపద్దతిలో తీసుకోవడంతోపాటుగా వాటి పరిష్కారానికి అదేవిధంగా సకాలములో చర్యలు తీసుకుంటూ విధేయతతో పనిచేస్తూ ప్రభుత్వ పనితీరు పట్ల విశ్వసనీయతను పెంపొందించాలని ఆయన సూచించారు. గ్రామాబివృద్దిని సాధించడానికి ప్రజల జీవన విధానాలను పెంపొందించడానికి ప్రతి కుటుంబానికి సంక్షేమ పధకాల లబ్దిని చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్దను అందుబాటులోనికి తెచ్చిందని ప్రభుత్వ పాలనను ప్రజలకు చేర్చేందుకు సచివాలయాలు ఆవిర్బవించాయన్నారు. గాంధీ కలల సాకారమే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని ఆదిశగా ఆవిర్బవించినవే గ్రామ, వార్డు సచివాలయాలు అన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్ద ప్రజలకు చేరువగా ఉంటూ ప్రజావసరాలను సమస్యలను తెలుసుకుంటూ కావాల్సిన కనీస సేవలను అందించి వారి అభ్యున్నతికి పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ కుమారి పి. సింధు సుబ్రహ్మణ్యం, మండల తాహసిల్దారు పి. తేజోశ్వరరావు, మండల పరిషత్ అభివృద్ది అధికారి నాగేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు.