ఘనంగా ఉపసర్పంచ్ జన్మదినోత్సవం..
Ens Balu
3
Sankhavaram
2021-07-16 14:42:29
ప్రజాసేవే పరమావధిగా భావించి శక్తివంచన లేకుండా సేవలందించే ఉపసర్పంచ్ చింతంనీడి కుమార్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని సచివాలయ కార్యదర్శిలు రాంబాబు, శంకరాచార్యులు, సత్యలు కోరారు. శుక్రవారం శంఖవరం మండల కేంద్రంలో ఉపసర్పంచ్ కుమార్ జన్మదిన వేడుకలు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సచివాలయ సిబ్బంది సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేట్ కట్ చేయించి మిఠాయిలు పంచారు. ఉపసర్పంచ్ కుమార్ మాట్లాడుతూ, తనపై ఎంతో అభిమానం చూపించే అభిమానులు, సచివాలయ సిబ్బంది, వైఎస్సార్సీపి కార్యకర్తల నడుమ జన్మదినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా వుందన్నారు. ఎమ్మెల్యే పర్వతపూర్ణచంద్రప్రసాద్ ఆశీస్సులతో ప్రజలకు సేవచేసుకునే భాగ్యం దక్కిందని, తనపై ఉంచిన నమ్మకాన్ని బాధ్యతను ఎంతో ఉన్నతంగా నెరవేరుస్తానని అన్నారు. సచివాలయం-1 కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలకు ఏ కష్టం వచ్చిన నేనున్నాంటూ ముందుకొచ్చి సేవలందించే ఉపసర్పంచ్ అనతికాలంలో ప్రజల మన్ననలు పొందారన్నారు. అలాంటి మంచి వ్యక్తిని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. ఈ సందర్బంగా సిబ్బంది, నాయకులు ఉప సర్పంచ్ కుమార్ కు కేక్ తినిపించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ జూనియర్ సహాయకులు రమణమూర్తి, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, మూడు సచివాలయాల సిబ్బంది, వైఎస్సార్సీపి మండల నాయకులు పర్వత స్వామి, బుర్రాలచ్చబాబు, పడాల భాషా, పడాల సతీష్, పడాల గంగాధర రామారావు అభిమానులు పాల్గొన్నారు.