రాజన్న రాజ్యంలో రైతన్నలకు పెద్దపీట..
Ens Balu
4
Sankhavaram
2021-07-16 14:50:02
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి రైతన్నలకు ఎంతో పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే పర్వతశ్రీపూర్ణచంద్రప్రసాద్ తో కలిసి శంఖవరం మండల కేంద్రంలోని రైతుభరోసా కేంద్రాలను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామస్థాయిలో రైతుల సమస్యలు తీర్చడంతోపాటు, నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందించాలనే లక్ష్యంతో ఈ రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం నిర్మించిందన్నారు. ఒకేసారి రెండు కేంద్రాలను ప్రారంభించడం ఆనందంగా వుందన్నారు. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ, ఏ రాష్ట్రప్రభుత్వంలోనూ లేని విధంగా గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి అక్కడే రైతులకు చేదోడుగా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఆర్బీకే వ్యవస్థను ఏర్పాటు చేసిందిన్నారు. గ్రామసచివాలయం, రైతుభరోసా కేంద్రం, వెల్ నెస్ కేంద్రాలు ఒకేచోట ఏర్పాటు చేసిన ఘనత వైఎస్సార్సీపి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆశయాలకు అనుగుణంగా, రాజన్న రాజ్యంలో రైతులు అభివ్రుద్ధి చెందడానికి ఆర్బీకేలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అనంతరం ఆర్బీకేలో ల్యాబ్, మందులు, అగ్రి కియోస్క్ లను పరిశీలించారు. అంతకుముందు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రుల బ్రుందం తిలకించింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ ఏడి సుంకర బుల్లిబాబు, ఏఓ కెజెచంద్రశేఖర్, హార్టికల్చర్ అధికారి శ్రీవల్లి, పశుసంవర్ధశాఖ ఏడి డా వీర్రాజు, వైద్యులు కె.ప్రసాద్, లావణ్య, ప్రియాంక, తహశీల్దార్ సుబ్రమణ్యం, ఎంపీడీఓ రాంబాబు, మూడు సచివాలయాల కార్యదర్శిలు రాంబాబు, శంకరాచార్యులు, సత్య, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, జూనియర్ సహాయకులు రమణమూర్తి, సర్పంచ్ బందిలి గన్నయ్యమ్మ, ఉప సర్పంచి చింతంనీడి కుమార్, పర్వత స్వామి, బుర్రాలచ్చబాబు, పడాల భాషా, పడాల సతీష్, పడాల గంగాధర రామారావు మండలంలోని అగ్రికల్చర్ అసిస్టెంట్లు, గ్రామవాలంటీర్లు, రైతులు పాల్గొన్నారు.