ప్రపంచదేశాలకు నేటికీ మహానుభావులు గుర్తే..


Ens Balu
5
Sankhavaram
2021-07-16 15:12:31

ప్రపంచ దేశాలకు భారత దేశం గుర్తుకు వస్తే  ముందుగా  జాతి పితగా కొలుచుకునే మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత  భారతరత్న, డాక్టర్ భీమారావు రాంజీ అంబేద్కర్ పేర్లేనని రాష్ట్రవ్యవసాయశాఖ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్,  కురసాల కన్నబాబు లు అన్నారు. శంఖవరం మండల కేంద్రంలో  ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ లతో కలసి గాంధీవిగ్రహాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, గాంధీ, అంబేద్కరుల త్యాగం, కృషి వలనే మన దేశంలోని ప్రతి పౌరుడూ నేడు స్వేచ్ఛగా జీవిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ఉండగా, రాజ్యాంగ రిజర్వేషన్లను ఏమాత్రమూ పొందని అన్ని కులాల్లోని ఆర్ధికంగా వెనుక బడిన నిరుపేద (ఇడబ్ల్యుఎస్) కుటుంబాల ప్రజల ప్రయోజనార్ధం వారికి 10 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారమే నిర్ణయం తీసుకుందని, ఇదొక గొప్ప విషయమని కన్నబాబు అభివర్ణించారు. ఇది గతంలో కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టమేనని, దీని అమలు వల్ల ప్రస్తుతం అమలవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లకు ఏమాత్రం నష్టం జరుగకుండా, గతంలో ఏ రిజర్వేషన్లు పొందని, గతంలో రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన కాపులతోబాటు కమ్మలు, రెడ్డిలు, రాజులు, బ్రాహ్మణులు, వైశ్యులు తదితరులంతా ఈ 10 శాతం రిజర్వేషన్లను పొందుతారు అన్నారు. అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అందరూ చదువుకోవాలి, అందరూ ఆర్ధికంగా ఎదగాలని నాడు కృషి చేసిన దివంగత నేత రాజశేఖరరెడ్డి ఆశయాలను అమలు పరుస్తూ, ఆయన వారసునిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ప్రగతి పధంలో ముందుకు తీసుకు వెళుతున్నారని స్పష్టం చేశారు. శంఖవరంలో 1956 సంవత్సరంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని పునరుద్ధరించ డానికి అన్ని సామాజిక వర్గాల ప్రజలనూ ఏకాభిప్రాయానికి తేవడానికి ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ చేసిన కృషి అభినందనీయం అన్నారు. శంఖవరం సర్పంచ్ బందిలి గన్నియ్యమ్మ, ఉపసర్పంచ్ చింతంనీడి కుమార్, అన్నవరం సర్పంచ్ శెట్టిబత్తుల కుమారరాజా, కత్తిపూడి సర్పంచ్ కొల్లు వెంకట సత్యనారాయణ, మండపం సర్పంచ్ కూనిశెట్టి మాణిక్యం, గౌరంపేట సర్పంచ్ రామిశెట్టి ఏసుబాబు, నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, ఏలేశ్వరం నగర పంచాతీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.
సిఫార్సు