గిరిజన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర..


Ens Balu
5
Paderu
2021-07-16 15:33:39

గిరిజన ఉత్పత్తులకు అధిక ధరకు విక్రయించడానికి చర్యలు తీసుకుంటున్నామని సమీకృత గిరిజనాభివృధ్ది సంస్ధ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాల క్రిష్ణ తెలిపారు. మండలంలోని దేవాపురం, ఈదుల పాలెం ,పులుసుమామిడి గ్రామాల పరిధిలో గిరిజన రైతులు సాగు చేస్తున్న అనాసపనాస, సీతాఫలం,పనస పండ్లను విశాఖపట్నం తరలించి రైతు బజార్లులో విక్రయించడానికి రెండు ఆటోలలో నాలుగు వేల అనాస పనాస పళ్లు వాహనాలను శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన రైతులతోమాట్లాడుతూ గిరిజన ఉత్పత్తులను దళారులకు విక్రయించ కుండా విశాఖపట్నం రైతు బజార్లులో అమ్మకానికి జాయింట్ కలెక్టర్ వేణుగోపాల రెడ్డితో మాట్లాడి తగిన అవకాశం కల్పించాలని కోరారు. ఏజెన్సీలో దళారులు తగిన గిట్టుబాటు ధరను రైతులకు అందించడంలేదని విశాఖపట్నం సీతమ్మధార, ఎంవిపి రైతు బజారులలో విక్రయిస్తే రైతులకు లాభం చేకూరుతుందన్నారు. దేవాపురం గ్రామంలో గిరిజన రైతులతో మాట్లాడుతూ అటవీ ఫలాలను రైతు బజారులలో విక్రయించడానికి ప్రతీ ఏడాది చర్యలు చేపడతామన్నారు. అటవీ ఉత్పత్తులను రైతు బజార్లులో విక్రయించడానికి మార్కెటింగ్ శాఖ ద్వారా అవసరమైన గుర్తింపు కార్డులను అందిస్తామన్నారు. అటవీ ఉత్పత్తులను నిల్వ చేయడానికి దేవాపురం గ్రామంలో గిడ్డంగిని నిర్మిస్తామన్నారు. గ్రామస్తులతో మాట్లాడి గ్రామ సమస్యలను అడిగితెలుసుకున్నారు. 12వమైలు రాయి నుంచి దేవాపురం గ్రామానికి ఉన్న రహదారిని మరమ్మతులు చేయించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. అనంతరం ఈదుపాలెం ప్రాధమిక ఆరోగ్యకేంద్రాన్ని తరిఖీ చేసారు. అసుపత్రి అటెండెన్సు రిజిష్టరు, మూవ్‌మెంట్ రిజిష్టర్లను తనిఖీ చేసారు. ఆసుపత్రిలో జరుగుతున్న నాడు నేడు పనుల పురోగతిని వైద్యాధికారి డా.లక్ష్మినాగేశ్వరి వివరించారు. విద్యుత్తు నిత్యం అంతరాయం జరుగుతోందని పి ఓ దృష్టికి తీసుకుని వచ్చారు.నాడు నేడు పనుల్లో అభివృధ్ది పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్టాక్‌రూం పరిశీలించారు. మందుల నిల్వలను రికార్డులను తనిఖీ చేసారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఉద్యాన వన అధికారి జి. ప్రభాకర రావు, తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు