స్థానిక నివాసం లేకపోతే ఇంటికి పంపిస్తా..ఐటిడిఏ పిఓ
Ens Balu
1
Paderu
2020-09-03 13:11:40
పాడేరు ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉండకపోతే చర్యలు తీసుంటామని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి డా.వెంకటేశ్వర్ సలిజామల తీవ్రంగా హెచ్చరించారు. గురువారం ఈమేరకు అధికారులకు ఉత్తర్వులు జారీచేశారు. గవర్న మెంట్ జి.ఓ.57 ప్రకారం స్థానికంగా ఉండని అధికారులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఏజెన్సీ నుంచి అధికారులు మైదాన ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అనుమతిపొంది వెళ్లాలని చెప్పారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఘాటుగా హెచ్చరించారు. పీఓ జారీచేసిన ఉత్త ర్వులతో స్థానికంగా ఉండని అధికారులు ఖచ్చితంగా స్థానికంగా ఉండాల్సిందే. ముఖ్యంగా వైద్య ఆరోగ్యశాఖ, ఇంజనీరింగ్, గ్రామసచివాలయ సిబ్బంది మైదాన ప్రాంతాల నుంచి అధికంగా రాకపోకలు సాగిస్తున్నారు. మన్యంలో బయోమెట్రిక్ లేని ప్రాంతాల్లో కొంతమంది సిబ్బంది 15 రోజులకి ఒకసారి కూడా ప్రభుత్వ కార్యాల యాలకు రాకుండా కొందరు అధికారుల అండదండలతో ఇష్టానుసారం విధులు నిర్వహిస్తున్నారు. పీఓ జారీ చేసిన ఉత్తర్వులతో ఖచ్చితంగా స్థానికం నివాసం లేకపోతే చర్యలు తప్పేట్టు లేవు...