డా.బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తి తో సహకారం..


Ens Balu
3
Sankhavaram
2021-07-18 17:17:12

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని తమవంతు సేవ రూపంలో దళిత ఐక్యవేదిక సేవాసంఘం ఆదివారం తమవంతు సహాయాన్ని అందించింది.  శంకవరం మండల కేంద్రంలోని దళితవాడలో కంది కట్ల సుశీలకు చెందిన ఒంటరి మహిళ ఇల్లు 4 నెలల కిందట విద్యుత్ తీగలు తగిలి కాలి బూడిదైపోయింది. అప్పటి నుంచి ఎలాంటి ఆసరా లేని ఆమెకు శంఖవరం దళితవాడ అంబేద్కర్ యూత్, దళిత ప్రజా ఐక్యవేదిక సేవా సంఘం  కమిటీ సభ్యులు చేయూనందించారు. నిలువ నీడలేని పేదరాలికి రేకుల షెడ్డు నిర్మించి అండగా నిలిచారు. ఈ సందర్భంగా బాధితురాలు సుశీల మాట్లాడుతూ, నా అన్న వారే పట్టించుకోని ఈరోజుల్లో  అంబేద్కర్ పేరుతో సహాయ సహకారాలు అందించిన కమిటీ సభ్యుల సహాయాన్ని తాను ఎన్నటికీ మరిపోనని అన్నారు. సంఘం సభ్యులు మాట్లాడుతూ, సంఘటన జరిగిన సమయంలో వీఆర్వో సందర్శించి 25 కేజీల బియ్యం అందజేశారు. రూ.75 వేలు నష్టాన్ని అంచనా వేశారు తప్పితే నేటి వరకూ నష్ట పరిహారం ప్రభుత్వం నుంచి రాలేదని ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం, స్థానిక తహశీల్దార్ స్పందించి ఒంటరి మహిళ సుశీలను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బందిలి లక్ష్మణరావు, గుణపర్తిఅప్పలస్వామి(అపురూప్), పులి కిషోర్, కొంగు రమేష్, భూర్తి దుర్గాప్రసాద్, బత్తిన తాతాజీ, గుణపర్తి కొండలరావు, కొంకిపూడి అప్పారావు, పులి అంబేద్కర్, అంగులూరి రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

సిఫార్సు