సర్టిఫికేట్ల విచారణ మహిళా పోలీసులకే..


Ens Balu
4
Sankhavaram
2021-07-19 15:28:43

నూతన ప్రభుత్వ ఉద్యోగుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ బాధ్యత మహిళలకు  అప్పగించడంతో శంఖవరం మహిళా పోలీస్ సోమవారం ఒక ఉద్యోగి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేయించారు. ఈ మేరకు మహిళా పోలీస్  జిఎన్ఎస్ శిరీష సోమవారం కత్తిపూడి, శంఖవరం ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాలలో తిరిగి ఉద్యోగుల సర్టిఫికేట్ల నిర్ధార‌ణ  చేపట్టి అన్నవరం స్టేషన్ కి అప్పగించారు. ప్రభుత్వం గతంలో ఈపని స్టేషన్ పోలీసులతో చేపట్టేది. ప్రస్తుతం ప్రభుత్వం సచివాలయ గ్రామ సంరక్షణా కార్యదర్శిలను సాధారణ పోలీసులుగా జీఓ నెంబరు 59 ద్వారా మార్చడంతో ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలు, పాస్ పోర్టు వెరిఫికేషన్లు అన్నీ మహిళా పోలీసులే చేపట్టనున్నారు. ఇవేకాకుండా త్వరలో పాస్ పోర్టు, ఇతర కేసులకు సంబంధించిన గ్రామస్థాయి విచారణ మొత్తం మహిళా పోలీసులే చేయనున్నారు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు చెందిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్ గ్రామ స్థాయిలో మహిళా పోలీసులే చేస్తున్నారు. వీరి సర్వీసులను కూడా ప్రభుత్వం ఈ ఏడాది చివరిలోపుగా దశలవారీగా రెగ్యులర్ చేయనున్నది.
సిఫార్సు