ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచాలి..


Ens Balu
5
Salur
2021-07-20 17:38:19

గ్రామ వలంటిర్లు తమ పరిధిలోగల 50 కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృధి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలి ప్రాజెక్ట్ అధికారి కూర్మనాథ్ పేర్కొన్నారు. ప్రాజెక్ట్ అధికారి మంగళవారం తన పర్యటనలో భాగంగా సాలూరు మునిసిపాలిటీ పి.ఎన్.బొడ్డవలస ఎం.ఇ స్కూల్ వద్దనున్న వార్డు సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసి వార్డు సచివాలయంలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ప్రోజెక్ట్ అధికారి మాట్లాడుతూ సిబ్బంది పనిచేసే చోట నివాసం ఉండాలని, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ ఆదేశాలను, నియమాలను అందరూ తప్పకుండా అనుసరించాలని, సేవలలో పారదర్శకత పాటించాలని సిబ్బందికి సూచించారు. అందరూ సమయ పాలన పాటించి విధులు నిర్వహించాలన్నారు.  పిర్యాదులు సేకరణ పరిష్కారంలో అలసత్యం వద్దని సూచించారు. ఈ క్రమంలో సిబ్బంది హాజరు పట్టిక, ప్రగతి నివేదికల రికార్డుల పరిశీలించారు. గ్రామంలో ప్రతి ఒక్కరికీ కరోనా నిర్మూలనకు సంబంధించిన జాగ్రత్తలు మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటిస్తూ, చేతులు శుభ్రం చేసుకోవాలి అని అందరిలో అవగాహన కల్పించాలన్నారు. ఈ పర్యటనలో సాలూరు మున్సిపల్, మండల రెవెన్యూ అధికారులు, వార్డు సచివాలయాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు