మహిళల రక్షణే సీఎం జగన్ ప్రధాన లక్ష్యం..


Ens Balu
6
Sankhavaram
2021-07-21 08:46:04

రాష్ట్రంలో మహిళలు, విద్యార్ధుల రక్షణే ధ్యేయంగా వైఎస్.జగన్మోహనరెడ్డి పనిచేస్తూ.. వారందరికీ తోడుగా నిలవడానికి దిశ యాప్ ను రూపొందించారని ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వతశ్రీపూర్ణచంద్ర ప్రసాద్ అన్నారు. బుధవారం శంఖవరం మండల కేంద్రంలోని శ్రీసత్యదేవ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన దిశ అవగాహన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అక్క చెల్లమ్మలకు ఆపద సమయంలో వారి దశను మార్చడానికే దిశయాప్ ని ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకు వచ్చిందన్నారు. ఎక్కడ మహిళకు అన్యాయం జరిగినా దిశ ద్వారా పోలీసులు చేరుకునే విధంగా అత్యంత సాంకేతికతో దీనిని రూపొందించాని చెప్పారు. అలాంటి రక్షణ ఇచ్చే యాప్ ను ప్రతీ ఒక్కరూ వారి మొబైల్ ఫోన్లలలో ఇనిస్టాల్ చేసుకొని అత్యవసర సమయంలో పోలీసుల సహాయం పొందాలన్నారు. అంతేకాకుండా గ్రామస్థాయిలో ప్రజలకు రక్షణ కల్పించడానికి కూడా మహిళా పోలీసు అనే వ్యవస్థను కూడా గ్రామసచివాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ప్రజల సంక్షేమం, రక్షణ ఏకకాలంలో చూస్తున్న  ఏకైక ప్రభుత్వం ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. మహిళలంతా దిశ యాప్ ఇనిస్టాల్ చేసుకుంటే ఒక సెక్యూరిటీ గార్డు వెనుక ఉన్నట్టేనని ఎమ్మెల్యే పర్వత పేర్కొన్నారు. ఎంపీడీఓ రాంబాబు మాట్లాడుతూ, అపోహలు వీడి ప్రతీ మహిళతోపాటు పురుషులు కూడా ఈ యాప్ ని ఇనిస్టాల్ చేసుకోవాలన్నారు. అందరూ ఈ దిశ ఎస్ఓఎస్ యాప్ ఇనిస్టాల్ చేసుకుంటే దైర్యంగా ఉండొచ్చునన్నారు. అన్నవరం ఎస్ఐ రవికుమార్ మాట్లాడుతూ, దిశ యాప్ ఏవిధంగా పనిచేస్తుందో,  అందులోని ఆప్షన్లు వారీగా మహిళలకు వివరించారు. మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష మాట్లాడుతూ, దిశ యాప్ మహిళలకే కాకుండా పురుషులకు కూడా ఉపయోగపడుతుందన్నారు. ఆపద సమయంలో ఎదుటి మహిళలకు రక్షణ కల్పించడానికి పురుషులు కూడా దీనిని వినియోగించువచ్చునన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోనే శంఖవరం మండలంతో పాటు ప్రత్తిపాడు నియోజకవర్గమంతా దిశ యాప్ వినియోగం, రిజిస్ట్రేషన్ లో అగ్రభాగంలో నిలపడానికి ఎమ్మెల్యే విషయంగా క్రుషి చేస్తున్నారని అన్నారు. స్థానిక పంచాయతీలో ఉప సర్పంచ్ చింతంనీడి కుమార్ ఆధ్వర్యంలోనూ వాలంటీర్లు దిశ యాప్ ఇనిస్టాల్స్ వేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్వత రాజబాబు, సర్పంచ్ బందిలి గన్నియ్యమ్మ, మూడు గ్రామసచివాలయాల కార్యదర్శిలు రాంబాబు, శంకరాచార్యులు, సత్య, జూనియర్ సహాయకులు రమణమూర్తి, వైఎస్సార్సీపీ నాయకులు పడాల సతీష్, బైరా శ్రీరామ్మూర్తి, అడపావీరబాబు, పడాల బుజ్జి,  బందిలి వీరబ్బాయ్, మూడు సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
సిఫార్సు