శంఖవరం మండలంలో వైఎస్సార్ హౌసింగ్ గ్రౌండింగ్ పనులు వేగంగా జరుగుతు న్నాయని తాహసిల్దార్ సుబ్రహ్మణ్యం తెలియజేశారు. గురువారం శంఖవరంలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మండలంలో 1402 ఇళ్లు మంజూరు అయ్యాయని అందులో గాను 400 ఇళ్లు గ్రౌండింగ్ జరిగిందన్నారు. ఈ ఇళ్లన్నీ గుడా పరిధిలోనివేనని తహశీల్దార్ వివరించారు. ప్రస్తుతం లబ్దిదారులు నిర్మాణ సామాగ్రితో పనులు వేగవంతం చేస్తున్నామని తహశీల్దార్ వివరించారు. ఇంకా ఇళ్లు గ్రౌండింగ్ చేయని వారిని కూడా ప్రోత్సహించి ఇళ్ల నిర్మాణానికి ముందుకి తీసుకు వస్తున్నామన్నారు. ఈ విషయమై ఇప్పటికే జిల్లా కలెక్టర్ జి.మురళీధరరెడ్డి ఆదేశాలు కూడా జారీచేసినట్టు తహశీల్దార్ చెప్పారు.