డ్వాక్రా మహిళలకు కోవిడ్ వేక్సినేషన్..
Ens Balu
2
Bhogapuram
2021-07-22 15:43:22
జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ, వైఎస్ఆర్ క్రాంతిపథం ఆధ్వర్యంలో ప్రత్యేక కోవిడ్-19 వేక్సినేషన్ కార్యక్రమం భోగాపురం మండలం పోలిపల్లి పిహెచ్‌సిలో గురువారం ప్రారంభమయ్యింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆదేశాల మేరకు, ఈ కార్యక్రమాన్ని డిఆర్‌డిఏ పిడి కె.సునీల్ రాజ్‌కుమార్ ప్రారంభించారు. వయసు 45 ఏళ్లు దాటిన వైఎస్ఆర్ క్రాంతిపథం, డిఆర్‌డిఏ సిబ్బందితో బాటు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు వేక్సిన్ వేశారు. తొలిరోజు సుమారు 246 మంది వేక్సిన్ వేయించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని పిహెచ్‌సిల్లో నిర్వహిస్తామని పిడి సునీల్ రాజ్‌కుమార్ తెలిపారు. తమ శాఖ సిబ్బందితోపాటు, స్వయం సహాయక సంఘాల మహిళలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకొని, వేక్సిన్ వేయించుకోవాలని కోరారు. మొదటి డోసుతోపాటు, అవసరమైన వారికి రెండో డోసును కూడా వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి జె.విజయలక్ష్మి, వైఎస్ఆర్‌కెపి ఏరియా కో-ఆర్డినేటర్, ఎపిఎంలు, పిహెచ్‌సి వైద్యులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.