సచివాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్..


Ens Balu
3
అచుతాపుత్రయం
2021-07-23 13:00:22

ప్రజలకు సేవలందించడంలో గ్రామసచివాలయాలు రాష్ట్రంలోనే ముందుండాలని జిల్లా కలెక్టర్ జి.మురళీధరరెడ్డి సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం పెదపూడి మండలం, అచుతాపుత్రయం గ్రామ సచివాలయాన్ని జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) జి లక్ష్మీశ తో కలిసి జిల్లా కలెక్టర్  ఆకస్మికంగా తనిఖీ చేశారు. నవరత్నాలు- పేదలందరికీ ఇల్లు, ఇతర సేవలకు సంబంధించిన రిజిస్టర్లను, సిబ్బంది హాజరు పట్టుకను క్షుణ్ణంగా పరిశీలించి, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందరికీ అందే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. సచివాలయానికి వివిధ సేవల నిమిత్తం వచ్చిన దరఖాస్తులను తప్పనిసరిగా గడువులోపు పూర్తి చేయాలన్నారు. నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు పథకానికి సంబంధించి గ్రౌండింగ్ పూర్తి అయిన ప్రతి ఇల్లు నిర్మాణం పూర్తయ్యే విధంగా లబ్ధిదారులను చైతన్యపరచలని కలెక్టర్ తెలిపారు.  ఈ పర్యటనలో ట్రైనీ కలెక్టర్ గీతాంజలి శర్మ ఆర్డిఓ ఏజి.చిన్ని కృష్ణ , తాసిల్దార్ టి.సుభాస్, ఎంపీడీవో పి.విజయభాస్కర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
సిఫార్సు