రేషన్ బియ్యం పింపిణీ చేసిన జెసి..
Ens Balu
3
Pedapudi
2021-07-23 13:03:56
ప్రజలకు ప్రభుత్వం నిర్ధేశించిన సమయంలోగా రేషన్ బియ్యం పంపిణీ చేయాలని జెసి జి.లక్ష్మీశ పేర్కొన్నారు. శుక్రవారం పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో ఎం.శ్రీరంగ నాయకమ్మ రేషన్ షాప్ ను రెవెన్యూ అధికారులు ,ట్రైనీ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి జేసీ లక్ష్మీశ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రధానమంత్రి కళ్యాణ అన్న యోజన పథకం కింద ఉచితంగా బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని, రేషన్ షాప్ లో ఉన్న స్టాకు వివరాలను ,బియ్యం నాణ్యతను, బయోమెట్రిక్ విధానాన్ని జేసీ ఈ సందర్భంగా పరిశీలించి , లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఏజీ.చిన్నికృష్ణ , తహసిల్దార్ టి.సుభాష్, గ్రామ రెవిన్యూ అధికారి రామకృష్ణ ,ఇతర అధికారులు పాల్గొన్నారు.