తూర్పుగోదావరి జిల్లాలో గతంలో కంటే మెరుగ్గా ఆధునిక పరిజ్ఞానంతో కూడిన పద్ధతిలో రైతులకు ఈ-క్రాప్ బుకింగ్ నమోదు జరుగుతుందని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం అనపర్తి నియోజకవర్గం, పెదపూడి మండలం, అచుతాపుత్రయం గ్రామంలో ఈ -క్రాప్ బుకింగ్ చేసే విధానాన్ని వ్యవసాయ శాఖ అధికారులు , జాయింట్ కలెక్టర్ రెవెన్యూ జి లక్ష్మీ శ తో కలసి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి,అనపర్తి శాసనసభ్యులు డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం రైతులకు సంబంధించి ప్రతి గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రాన్ని సింగిల్ స్టాప్ విధానంలో ఫర్టిలైజర్స్, విత్తనాలు, ఎరువులతో పాటు పంట పండించిన తర్వాత పంట మార్కెటింగ్ చేసుకునే విధంగా అన్ని సదుపాయాలు అందించే విధంగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. గ్రామస్థాయిలో ప్రతి నెల మొదటి శుక్రవారం,రెండవ శుక్రవారం.మండల స్థాయిలోను వ్యవసాయ సలహా మండలి కమిటీ సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని ఈ సదుపాయాలను రైతులు సద్వినియోగం చేసుకొని వ్యవసాయంపై అవగాహన పెంపొందించుకోవాలి అన్నారు. జిల్లాలో వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక రైతు ఎంత విస్తీర్ణంలో, ఏ రకమైన పంట పండింస్తునారో వంటి వివరాలు ఈ-క్రాప్ ద్వారా నమోదు చేయడం జరుగుతుందని ప్రస్తుతం ఆధునిక పరిజ్ఞానంతో బయోమెట్రిక్ అథంటీకేషన్ ద్వారా మరింత ఎక్కువ సమాచారం యాప్ లో నమోదు చేయడం జరుగుతుందన్నారు.దీని ద్వారా గతంలో కంటే మెరుగుగా ఈ -క్రాప్ బుకింగ్నమోదు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
అనపర్తి శాసనసభ్యులు డా. సత్తి సూర్య నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తూ వేల కోట్ల రూపాయలు వ్యవసాయరంగానికి ఖర్చు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రధానంగా అధిక వర్షాలు, వరదలు సంభవించినప్పుడు పంట పొలాలన్నీ ముంపునకు గురవుతున్నాయని ఈ సమస్యను అధిగమించే విధంగా కాలవలు , డ్రైనేజీలలో పేరుకుపోయిన చెత్త, పూడిక తీసే విధంగా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే సూచించారు. అచుతాపుత్రయం గ్రామానికి చెందిన కొంట్టెళ్ళ.సుబ్బారావు వ్యవసాయ పొలం దగ్గర ఈ -క్రాప్ నమోదు ప్రక్రియను కలెక్టర్,ఎమ్మెల్యే, జాయింట్ కలెక్టర్ ఈ సందర్భంగా గా పరిశీలించారు. అనంతరం అచుతాపుత్రయం వద్దనున్న పశ్చిమ ఏలేరు కాలువ,కరకుదురు వద్ద నున్న కైకవోలు మురికి కాలువ డ్రైనేజీ పనులను డ్రైనేజీ శాఖ అధికారులతో కలిసి కలెక్టర్, ఎమ్మెల్యే ,జాయింట్ కలెక్టర్ పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మురికి కాలవ డ్రైనేజీలో డ్రోన్ సహాయంతో గుర్రపు డెక్క కు మందు పిచికారీ చేసే విధానాన్ని ఈ సందర్భంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ గీతాంజలి శర్మ ,జిల్లా వ్యవసాయశాఖ జేడీ విజయ్ కుమార్, ఆర్టీవో ఏజీ.చిన్నికృష్ణ,ఏడిఏ పద్మశ్రీ, తహశీల్దార్ టీ.సుభాష్, ఎంపీడీవో పీ. విజయ భాస్కర్,మండల వ్యవసాయ అధికారి సిహెచ్. సత్యనారాయణ, డ్రైనేజీ శాఖ ఈఈ లు ,గ్రామ వ్యవసాయ సహాయకులు ,రైతులు పాల్గొన్నారు.