అంకిత భావంతో పనిచేసి గ్రామాభివృద్ధికి సహకరించండి అని జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాలా పేర్కొన్నారు. పార్వతీపురం డివిజన్ లో గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర ఉద్యాన కళాశాలలో పార్వతీపురం, సీతానగరం, కొమరాడ మండలాల సర్పంచులకు నిర్వహిస్తున్న రెండవరోజు శిక్షణా కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల (అభివృధి), జాయింట్ కలెక్టర్ మయుర్ అశోక్ (హౌసింగ్) పాల్గొన్నారు. ముందుగా శిక్షణా కార్యక్రమ నిర్వహణ పై ఆరా తీశారు. అనంతరం శిక్షణకు హాజరైన సర్పంచులతో మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఈ శిక్షణ చాలా ఉపయోగపడుతుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై, సర్పంచుల విధివిధానాలపై పూర్తిగా అవగాహన కల్పించుకోవలన్నరు. అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అన్నారు.
జాయింట్ కలెక్టర్ మయుర్ అశోక్ మాట్లాడుతూ ఈ శిక్షణ గ్రామంలో మీకు మంచి పేరు తెచ్చిపెడుతుందని అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి వారికి సత్వరం లబ్ధి చేకూరేలా చూడాలన్నారు.
రెండవ రోజు శిక్షణా కార్యక్రమంలో మండలాల వారిగా వారికి కేటాయించిన గదులలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు, రెండవ రోజు శిక్షణలో నియంత్రణ అధికారులతో గ్రామ పరిపాలన, గ్రామపంచాయతీల అర్ధిక పరిపుష్టి, ఆర్థిక వ్యవహారాలు, గ్రామ పంచాయతీల ఆదాయ, వ్యయాలు, ఇంటి ముంగటికే సంక్షేమ పథకాలు,నవరత్నాలు, గ్రామ సచివాలయాల ద్వారా అందిస్తున్న వివిధ పథకాలు తదితర అంశాలపై శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సి.ఇ.ఓ వెంకటేశ్వర రావు, డి.ఎల్.డి. ఓ రాజ్ కుమార్ మూడు మండలాల గ్రామాలకు నూతనంగా ఎన్నికైన సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.