బయో మెట్రిక్ లో ఏ ప్రభుత్వ ఉద్యోగికి మినహాయింపులేదని ఎంపీడీఓ జె.రాంబాబు స్పష్టం చేశారు. శుక్రవారం మండల కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బయో మెట్రిక్ ఆధారంగా మాత్రమే వచ్చేనుంచి ఉద్యోగులకు జీతాలు పడతాయన్నారు. ఇటు గ్రామ పంచాయతీ గ్రేడ్1,2,3,4 కార్యదర్శిలు, ఇతర ఇబ్బంది కూడా బయో మెట్రిక్ వేయాల్సిందేనన్నారు. ప్రభుత్వం బయోమెట్రిక్ ను తప్పని సరిచేసిన సందర్భంలో సచివాలయ ఉద్యోగులు సమయానికి ఇన్, ఔట్ వేయాలన్నారు. ఎపుడైనా బయోమెట్రిక్ మిషన్లు పనిచేయని సమయంలో దానికి గల సాంకేతిక కారణాలు, స్క్రీన్ షాట్ లను తీసి జిల్లా కార్యాలయానికి పంపిస్తున్నామన్నారు. కొన్ని చోట్ల బయోమెట్రిక్ పనిచేయటం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని, వాటికారణంగా ఉద్యోగులకు సాయంత్రం సమయంలో ఆలస్యమవుతున్న విషయం కూడా తమ ద్రుష్టికి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని కూడా జిల్లా అధికారులకు తెలియజేసినట్టు ఎంపీడీఓ వివరించారు. అదే సమయంలో ఉద్యోగులు జాబ్ చార్టు, మూమెంట్ రిజిస్టర్లను కూడా తప్పనిసరిగా వినియోగించాలన్నారు. సీనియర్ కార్యదర్శిలకు కూడా పలుమార్లు సమావేశాల్లో ఈ విషయాన్ని తెలియజేసినట్టు ఆయన పేర్కొన్నారు.