కోవిడ్ కేంద్రాలను పరిశుభ్రం ఉంచాలి..ఆర్డీఓ
Ens Balu
2
Paderu
2020-09-03 18:48:28
విశాఖ ఏజన్సీ లోని కోవిడ్ కేంద్రాలు పరి శుభ్రంగా ఉంచాలని రెవెన్యూ డివిజనల్ అధికారిణి కె.లక్ష్మి శివజ్యోతి వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం పాడేరు లో ని కోవిడ్ కేంద్రాన్ని గారు ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈసందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ, కోవిడ్ కేసులున్న ఏరియాలో కంటైన్మెంటు జోన్స్ ఏర్పాటు చేయాలన్నారు. చుట్టుపక్కల బార్కేట్స్ ఏర్పాటు చేసి ఒకప్రక్క మార్గం వుండేటట్లు చూడాలని, ఈ కోవిడ్ కేంద్రాలకు సంబంధించి పంచాయితీ సెక్రటరీ లు, విలేజ్ వాలంటీర్లు కంటైన్మెంటు జోన్స్ లోకి బయట వారిని రానివ్వకుండా చూడాలన్నారు. కోవిడ్ సెంటర్స్ ను ఎంపి.డి.ఓ లు,వైద్య సిబ్బంది నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతీ 200 మీటర్ల పరిధిలో కోవిడ్ కేసులు వచ్చినచో కంటైన్మెంటు జోన్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. కంటైన్మెంటు జోన్ 28 రోజులు వుంచి అధికారులు ఆదేశాలు ఇచ్చేవరకు బార్కేట్స్ ని తొలగించకూడదని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎడిషనల్ డియమ్ హెచ్. ఓ.లీలాప్రసాద్,మెడికల్ ఆఫీసర్ ప్రవీణ్, కోవిడ్ నూడల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ వర్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.