తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం నిర్వహించే మెగా కోవిడ్ వేక్సినేషన్ కార్యక్రమంలో శంఖవరం మండలానికి 4వేల డోసులు కేటాయించారని ఎంపీడీఓ జె.రాంబాబు తెలియజేశారు. ఆదివారం ఈ మేరకు శంఖవరంలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల పరిధిలో ఉదయం 6గంటల నుంచే ఈ వేక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు చెప్పారు. ఒక్కో సచివాలయానికి 200 నుంచి 300 డోసులు టార్గెట్లు ఇస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమాన్ని అన్ని పంచాయతీ సర్పంచ్ లు, సచివాలయ సిబ్బంది, వైద్యసిబ్బంది, అంగన్వాడీలు, పంచాయతీ సిబ్బంది సంయుక్తంగా పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. సచివాలయాల పరిధిలోని వాలంటీర్ల ద్వారా సమాచారాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని ఆదేశాలు జారీచేసినట్టు ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.