వేక్సినేషన్ కు అంగన్వాడీలు సిద్దం కావాలి..
Ens Balu
4
Sankhavaram
2021-07-25 12:18:52
కోవిడ్ మెగా వేక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అంగన్వాడీ కార్య కర్తలంతా సిద్దం కావాలని శంఖవరం సచివాలయ మహిళా పోలీస్ జీఎన్ఎస్ శిరీష కోరారు. ఈమేరకు శంఖవరం మండల కేంద్రంలోని మీడియాకి ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం మెగా వేక్సినేషన్ కార్యక్రమం ద్వారా 45ఏళ్లు దాటిన మహిళలందరినీ మండల కేంద్రంలోని 8 అంగన్వాడీలు, 3 సచివాలయాల పరిధిలోని జాబితాల వారీగా సమాచారం అందించాలన్నారు. ముందుగా మొదటి డోసు వేస్తే వేసి 84 రోజులు పూర్తయిన తల్లులకు రెండో డోసు వేయించడానికి జాబితా ప్రకారం కబుర్లు చెప్పాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు అంగన్వాడీలతోపాటు, మూడు సచివాలయాల్లోని వాలంటీర్లు కూడా ఈ డ్రైవ్ లో బాగస్వామ్యం కావాలని, సుమారు 900 డోసుల వరకూ ప్రభుత్వం కేటాయించిందని, శతశాతం వినియోగానికి అంతా సహకరించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.