పొలం బడితో రైతులకు మేలైన సూచనలు, సలహాలు


Ens Balu
3
Annavaram
2020-09-03 19:06:49

రైతులు పొలం నిర్వహణలో మిత్ర పురుగుల యొక్క లాభాలు తెలుసుకోవడం ద్వారా పంటల యాజమాన్యం సులువు అవుతుందని వ్యవసాయాధికారి కెజె చంద్రశేఖ ర్ సూచించారు. గురువారం శంఖవరం మండలం అన్నవరంలో రైతులకు పొలంబడి నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పలు యాజమాన్య పద్దతులపై సూచనలు సలహాలు చేశారు. అంతేకాకుండా పంటలకు ఎలుకలు ఏ విధంగా నష్టం కలిగిస్తాయో వివరిస్తూ, వాటిని నియంత్రించే పద్దతులను కూడా రైతులకు తెలియజేశారు. రైతులు నిత్యం పొలం బడి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మంచి యాజమాన్య పద్దతులు తెలుసుకోవడంతోపాటు, ప్రభుత్వం అందించే పలు పథకాల కోసం కూడా తెలుసుకోవడానికి వీలుపడుతుందన్నారు. గ్రామాల్లో రైతులకు ఏ అవసరం వచ్చినా ప్రతీగ్రామంలోని రైతు భరోసా కేంద్రాలను సంప్రదిస్తే అక్కడ గ్రామ వ్యవసాయ సహాయకులు రైతులకు తగు సూచనలు సలహాలు ఇస్తారని అన్నారు. ఈ కార్యక్రంలో ఏఈఓ వై.రాబిన్ సుదర్శన్, వివిఏ మణికంఠ, రైతులు పాల్గొన్నారు...