ఆగస్టు15 నాటికి గ్రామాలు స్వచ్ఛంగా మారాలి..
Ens Balu
5
Sankhavaram
2021-07-27 17:21:43
శంఖవరం మండలంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని ఎంపీడీఓ జె.రాంబాబు సచివాలయ కార్యదర్శిలను ఆదేశించారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో కార్యదర్శిలతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రామాలన్నీ ఆగస్టు 15నాటికి చెత్త రహిత గ్రామాలుగా మారిపోవాలన్నారు. దానికోసం సచివాలయ పరిధిలోని కార్యదర్శిలు స్వచ్ఛసంకల్ఫంపై ప్రత్యేకంగా ద్రుష్టి సారించాలన్నారు. అదేవిధంగా సచివాలయాల చుట్టు ప్రక్కల ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఇకపై జిల్లా అధికారులు పర్యటనలు నిరంతరంగా జరుగుతాయని, ఎవరు నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. అదే విధంగా పారిశుధ్య పనుల విషయంలో రాజీలేకుండా నిరంతరం పనిచేయాలన్నారు. కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శిలు పాల్గొన్నారు.