సచివాలయ సిబ్బంది స్థానికంగానే ఉండాలి..
Ens Balu
4
కొండకరకాం
2021-07-28 14:01:48
సచివాలయ సిబ్బంది గ్రామంలోనే నివాసం వుంటూ ప్రజలకు అందుబాటులో ఉన్నపుడే ఉత్తమ సేవలు అందించడం సాధ్యమవుతుందని జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు అన్నారు. గ్రామ ప్రజలతో మమేకమై పనిచేస్తూ ప్రభుత్వ పరంగా గ్రామీణులకు అవసరమైన సేవలందించాలని చెప్పారు. మండలంలోని కొండకరకాం గ్రామ సచివాలయాన్ని జె.సి. వెంకటరావు మంగళవారం తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది హాజరును పరిశీలించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందుతున్నదీ లేనిదీ ఆరా తీశారు. ప్రభుత్వ పథకాల సమాచారం, వాటిని పొందేందుకు కావలసిన అర్హతలు, దరఖాస్తులు చేసే విధానం తదితర వివరాలన్నీ సచివాలయంలో ప్రదర్శించినదీ లేనిదీ పరశీలించారు. ఇళ్లస్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 90 రోజుల్లో వాటిని మంజూరు చేస్తున్నదీ లేనిదీ తెలుసుకున్నారు. రేషన్‌కార్డుల జారీ ఎన్ని రోజుల్లో జరుగుతున్నదీ అడిగి తెలుసుకున్నారు. కార్యాలయ వేళల్లో సిబ్బంది అంతా సచివాలయంలో వుంటూ సేవలందించాలని, క్షేత్రస్థాయిలో వెళ్లాల్సి వస్తే మూవ్ మెంట్ రిజిష్టరులో సంతకం చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలపై గ్రామీణ ప్రజల్లో పూర్తిగా అవగాహన కలిగించేలా వలంటీర్ల సేవలను వినియోగించుకోవాలన్నారు.