గిరిజన గ్రామీణ ప్రజల జీవన స్థితిగతులను మెరుగు పరచడానికి, వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా నిలిచే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం పార్వతీపురం మండలం గిరిజన గ్రామాలు అయిన లిడికివలస, డోకుశీల గ్రామాలలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అటవీ భూముల్లో పండ్ల మొక్కలు పెంపకం పథకంలో భాగంగా గౌరవ అలజంగి జోగారావు, ఐటీడీఎ ప్రోజెక్ట్ అధికారి ఆర్. కూర్మనాథ్ ల చేతులు మీదుగా పండ్ల మొక్కలను గిరిజన ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు అలజంగి జోగారావు మాట్లాడుతూ గిరిజనులకు అండగా నిలిచి వారి ఆర్థిక స్థితి మెరుగు పరిచే ఉద్దేశంతో మన ఐటీడిఎ ప్రోజెక్ట్ అధికారి సహకారంతో అటవీ భూములలో పండ్ల మొక్కలను పెంచేందుకు ప్రభుత్వం ఏకరానికి 70 జీడి మొక్కలను ఉచితంగా పంపిణీ చేయడమే కాకుండా వాటి పెంపకానికి 3 సంవత్సరాలకు గాను 1.50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తుంది అని తెలిపారు. మొత్తం ఈ రెండు పంచాయతీల పరిధిలో దాదాపుగా 90 ఏకరాలకు మొక్కలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది అని తెలిపారు. కావున గిరిజన ప్రజలు అందరూ ప్రభుత్వం కల్పిస్తున్న ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని ఆర్థిక వనరుగా మార్చుకోవాలని హితవుపలికారు.
అనంతరం లిడికి వలస గ్రామం గిరిజనులతో ఏర్పాటు చేసిన సమావేశంలో శాసన సభ్యులు మాట్లాడుతూ పిల్లలు అందరిని బాగా చదివించాలని అదేవిధంగా తమ భర్తలను మద్యపానానికి దూరంగా ఉంచాలని మహిళలకు పిలుపునిచ్చారు. తన దృష్టికి వచ్చిన రోడ్డు సమస్యను త్వరలోనే పరిష్కరించి బిటి రోడ్డు వేయడం జరుగుతుందని అలానే చర్చి నిర్మాణానికి మరియు రామాలయం నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చడానికి ప్రయత్నిస్తానని, గ్రామంలో అంగన్వాడి కేంద్రం ఏర్పాటు చేయడానికి సంబంధిత అధికారులతో మాట్లాడతాను అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు ఎంపీడీవో కృష్ణారావు, ఎపిఓ భాను, ఉపాధిహామీ సిబ్బంది, మండల పార్టీ అధ్యక్షుడు రమేష్, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీ అభ్యర్థులు, వైసిపి సీనియర్ నాయకులు బలగ నాగేశ్వరరావు, వై తిరుపతిరావు, పల్లె భాను ప్రకాష్, రెడ్డి రవి, ఆర్ వి ఎస్ కుమార్, వైసిపి కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.