సచివాలయాన్ని తనిఖీ చేసిన జెసి..
Ens Balu
4
Cheepurupalli
2021-07-29 13:37:28
చీపురుపల్లి, గరివిడి మండలాల్లో జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) మయూర్ అశోక్ గురువారం ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన లేఅవుట్లు, సచివాలయాలను తనిఖీ చేశారు. చీపురుపల్లి మండలం జిటి అగ్రహారం లేఅవుట్‌ను జెసి పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అన్ని ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని, పనులు వేగంగా అయ్యేలా చూడాలని సూచించారు. ఇళ్ల నిర్మాణ సామగ్రి కొరత రాకుండా చూడాలన్నారు. ఈ పర్యటనలో మండల డిప్యుటీ తాశీల్దార్, గృహనిర్మాణశాఖ డిఇ, ఏఇ, ఇతర అధికారులు పాల్గొన్నారు. గరివిడి మండలం కొండపాలెం-1 సచివాలయాన్ని జెసి మయూర్ అశోక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు పట్టీని పరిశీలించారు. సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. పెండింగ్ దరఖాస్తులపై ఆరా తీశారు. సకాలంలో విధులకు హాజరవ్వాలని, ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో మండల తాశీల్దార్ శివన్నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.