తారకరామ కాలనీలో మంచినీటి కష్టాలు
Ens Balu
1
Annavaram Temple
2020-06-23 11:19:51
అన్నవరం తారకరామా కాలనీ వాసులు మంచినీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తారకరామా కాలనీ కొండ దిగువున ఉన్న భారీ మంచినీ పథకం మరమ్మత్తులకు గురికావడంతో ఈ కష్టాలు ఏర్పాడ్డాయని మహిళలు చెబుతున్నారు. నీటి పంపింగ్ కోసం మోటారు వేస్తుంటే పైపుల ద్వారా నీరు బయటకు వచ్చేస్తుందని, దీంతో సిబ్బంది మోటారు వేయడం లేదన్నారు. గత రెండు రోజులుగా నీటికష్టాలు తమను వెంటాడుతున్నాయని, ఈప్రాంతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ అధికారులు తక్షణమే స్పందించి నీటిపధకం పైపులీకేజీ పనులు చేపట్టాలని కోరుతున్నారు. ఎండాకాలం కావడంతో మంచినీ మహిళలమంతా చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.