శంఖవరంలో వైఎస్సార్ భీమా తొలి క్లైమ్ అందజేత..
Ens Balu
6
Sankhavaram
2021-07-31 07:40:53
వైఎస్సార్ భీమా నిరుపేదలకు ఎంతో భరోసాను ఇస్తుందని ఉప సర్పంచ్ చింతనీడి కుమార్ అన్నారు. శనివరం శంఖవరం మండల కేంద్రంలోని ఇటీవల గుండె పోటుతో మరణించిన కుటుంబానికి ప్రభుత్వం ద్వారా మంజూరైన తొలి వైఎస్సార్ బీమా క్లైమ్ రూ.లక్ష లో తక్షణ సహాయంగా రూ.పదివేలను నామినీ బోమిడి రాజామణి(తల్లి)కి అందజేశారు. ఇటీవలే మ్రుతుడు బోమిడి శ్రీను గుండెపోటుతో మరణించారు. అప్పటికే వీరు వైఎస్సార్ భీమా తీసుకోవడంతో వారికి నష్టపరిహారం అందిందని ఉప సర్పంచ్ చెప్పారు. అనంతరం ఉప సర్పంచ్ మాట్లాడుతూ, ప్రతీ ఒక్కరూ వైఎస్సార్ భీమా చేయించుకోవాలన్నారు. తద్వారా ప్రభుత్వం ద్వారా వచ్చే నష్టపరిహా సౌకర్యాన్ని, మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్సీ ప్రభుత్వం నిరుపేదల కోసం అందిస్తున్న వైఎస్సార్ భీమా సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటికి పెద్ద దిక్కుగా వున్నవారు హఠాత్తుగా కోల్పోతే ప్రభుత్వం ద్వారా వచ్చేసహాయంతో ఆ కుటుంబానికి చిన్న ఆశరా దొరుకుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శంఖవరం సచివాలయ కార్యదర్శిలు రాంబాబు, శంకరాచార్యులు, వీఆర్వో సీతారాం, సచివాలయ సంక్షేమ, విద్యా సహాయకులు దివాకర్, డిజిటల్ అసిస్టెంట్ జనార్ధన్, వైఎస్సార్సీపీ నాయకులు పడాల బాష, పడాల సతీష్,తదితరులు పాల్గొన్నారు.