ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచాలి..


Ens Balu
3
Salur
2021-07-31 16:39:46

ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగండి, ఆర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందజేయాలి, ప్రజల అవసరాలు తీర్చాలి అని ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్ కూర్మనాథ్  పేర్కొన్నారు.  సాలూరు, పాచిపెంట, మక్కువ, రామభద్రాపురం మండలాలకు సంబంధించి నూతనంగా ఎన్నికైన 101మంది గ్రామ సర్పంచులకు  ఈ నెల 29 వ తేది నుండి 3 రోజుల శిక్షణ మూడవ బ్యాచ్ ముగింపు కార్యక్రమం సమావేశానికి ఐ.టి.డి.ఎ ప్రోజెక్ట్ అధికారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ గ్రామ సర్పంచులకు  శిక్షణ అందించు నిమిత్తం  ప్రత్యేక శిక్షణ పొందిన మాస్టర్ ఆఫ్ ట్రైనర్ మీకు గ్రామ పరిపాలనకు సంబందించిన వివిధ రకాల అంశాల పై శిక్షణ అందించారని, ఈ శిక్షణ  మీకు మీ గ్రామ స్థాయిలో గ్రామ పరిపాలనకు ఎంతగానో సహకరిస్తుందని అన్నారు. గ్రామాలలో ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ అభివృధి సంక్షేమ కార్యక్రమాల పై అవగహన కల్పించాలన్నారు, అలాగే సచివాలయం లో అందిస్తున్న సేవలు తదితర అంశాలపై ప్రజలకు తెలియజేసి ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా చూడాలని అన్నారు. అలాగే ఈ మూడు రోజులు శిక్షణ పొందిన సర్పంచులకు ప్రోజెక్ట్ అధికారి ద్రువపత్రాలు అందజేశారు.

           ఈ సర్పంచుల శిక్షణ ముగింపు సమావేశాని జిల్లా పంచాయతీ అధికారి కె.సుభాషిణి, డి.ఎల్.డి.ఓ రాజ్ కుమార్, సాలూరు, పాచిపెంట, మక్కువ, రామభద్రాపురం మండలాల తహసీల్దార్లు, ఎం.పి.డి.ఓలు, రెవెన్యూ, పంచాయతీ రాజ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
సిఫార్సు