అంకిత బావంతో సేవలందించాలి..


Ens Balu
7
Paderu
2021-07-31 16:59:11

 అంకితభావంతో విధుల నిర్వహించి గిరిజనులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లిఖార్జున అన్నారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నాలుగవ రోజున శనివారం ఏజెన్సీలోని పాడేరు ,హుకుంపేట మండలాల్లో విస్త్రుతంగా పర్యటించారు. పాడేరు మండలంలోని వంట్ల మామిడి, వంతాడపల్లి గ్రామ సచివాలయాలు పరిశీలించారు. గ్రామ సచివాలయంలో సత్వరమే పౌర సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. రైస్ కార్డుల మంజూరు, కులదృవీ కరణపత్రాలు జారీపై ఆరా తీసారు. వంట్ల మామిడి మండలంలో గిరిజనులతో ముచ్చటించి గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిరాయితీ భూముల సరిహద్దులపై గ్రామస్తులు ఫిర్యాదు చేసారు. గ్రామ సభలు నిర్వహించి జిరాయితీ భూములకు సరిహద్దులు నిర్దారించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వంట్లమామిడి పంచాయతీ మోదాపల్లి గ్రామానికి చెందిన గిరిజన మహిళలు వై ఎస్ ఆర్ బీమా బయోమెట్రిక్ వేయడానికి వచ్చిన గిరిజన మహిళతో ముచ్చటించి ఎక్కడ నుంచి వచ్చారని ప్రశ్నించారు. వెంటనే పనులు పూర్తి చేయాలని సచివాలయం సిబ్బందిని ఆదేశించారు. బయో మెట్రిక్ సక్రమంగా పనిచేయకపోతే ఐరిష్ ఏర్పాటు చేయాలని ఎంపిడి ఓ ను ఆదేశించారు.వంతాడపల్లి గ్రామంలో జరుగుతున్న మొబైల్ ఆధార్ కేంద్రం సందర్శించి ఆధార్ కారుల్డలో సవరణలను పరిశీలించారు. సకాలంలో ఆధార్ కార్డులు సంబంధిత వ్యక్తులకు అందించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గుర్రగరువు గ్రామంలో అటవీ హక్కులు కల్పించిన భూములను పరిశీలించి ఏ విధమైన పంటలు పండిస్తున్నారని గిరిజన రైతులను అడిగి తెలుసుకున్నారు.గుర్రగరువు గ్రామస్తులు కమ్యూనిటీ భవనం మంజూరు చేయాలని కోరగా జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. హుకుంపేట మండలం కొట్నాపల్లి రైతు భరోసా కేంద్రం, మండల కేంద్రంలో గిరిజన సంక్షేమశాఖ బాలుర ఆశ్రమపాఠశాల -1,లో మనబడి నాడు నేడు పనులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసారు. మరుగుదొడ్లు, బాత్‌రూంలను పరిశీలించారు. అనంతరం చింతలవీధి హౌసింగ్ లేఅవుట్లను పరిశీలించారు. లబ్దిదారులను గ్రూపులుగా ఏర్పాటు చేసి గృహనిర్మాణాలు ప్రారంభించాలని గృహ నిర్మాణశాఖ ఇంజనీర్లను ఆదేశించారు.

సిఫార్సు