ఆ ముగ్గురు వైద్యులు తనను కలవాలి..


Ens Balu
5
Paderu
2021-07-31 17:00:33

పాడేరులోని జిల్లా ఆసుపత్రిని కలెక్టర్  డాక్టర్ ఎ. మల్లిఖార్జున సందర్శించారు. ఆసుపత్రిలో అన్ని విభాగాలను పరిశీలించారు. డ్రగ్ స్టోర్, సిటి స్కాన్, ఎక్సరే గది, రక్తపరీక్ష ల్యాబరేటరీ,కంటి పరీక్షల విభాగం, వార్డుల్లో పర్యటించి రోగులతో మాట్లాడి వైద్య సేవలు, భోజన సదుపాయాలపై ఆరాతీసారు. మెనూ చార్ట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆసుపత్రిలో మంజూరైన పోస్టులు,ఖాళీలను అడిగి తెలుసుకున్నారు. అటెండెన్సు రిజిష్టరు పరిశీలించి ముగ్గురు వైద్యులు విధుల్లో లేరని,వారిని రేపు తనను కలవాలని ఆదేశించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించనని హెచ్చరించారు. ఆరోగ్య శ్రీ కింద ఎన్న కేసులు నమోదవుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఐటిడి ఏ ప్రాజెక్టు అధికారి గోపాల క్రిష్ణ రోణంకి, సబ్ కలెక్టర్ వి. అభిషేక్ , గిరిజన సంక్షేమ శాఖ ఇ ఇ కెవి ఎస్ ఎన్ కుమార్, పాడేరు తాహశీల్దార్ ప్రకాశరావు, ఎంపిడి ఓ నరసింహరావు, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇ ఇ రామస్వామి, డివిజన్ అభివృధ్ది అధికారి జి.చిట్టిరాజు , వ్యవసాయాధికారి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

సిఫార్సు