విశాఖ జిల్లా కలెక్టర్ ఎ.మల్లిఖార్జున ఏజెన్సీ పర్యటనలో భాగంగా శనివారం మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షరాలు పాడేరు శాసన సభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ టి నర్సింగరావు, ఆలయ కమిటి ప్రధాన కార్యదర్శి కె. సింహచలం నాయుడు కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు ఆలయ లాంఛనాలతో జిల్లా కలెక్టర్‌కు స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి చత్రపటాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఐటిడి ఏ పి ఓ రోణంకి గోపాల క్రిష్ణ, సబ్ కలెక్టర్ వి. అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.