విధినిర్వహణే జీవితంలో పేరుతెచ్చేది..


Ens Balu
5
రైతులపూడి
2021-08-01 14:52:44

ప్రభుత్వ ఉద్యోగం చేయడం అంటే కత్తి మీద కర్ర సాము చేయడమంత సాహసమని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆదివారం రౌతులపూడి తాహసిల్దార్ ఏఏ.అబ్బాస్ ఉద్యోగ విరమణ, ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయ నాయకుల ఒత్తిడులు, ఒడిదుడుకులను తట్టుకుంటూ, ఉన్నతాధికారుల సూచనలను పాటిస్తూ, వివిధ గ్రామాల ప్రజలను సమన్వయం చేసుకుంటూ ఎంతో సహనంతో ప్రభుత్వ ఉద్యోగులు విధులను నిర్వర్తించాల్సి ఉంటున్నదని ఎమ్మెల్యే వివరించారు. 
వీఆర్వో స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకూ, వివిధ ప్రభుత్వ శాఖల్లోని వివిధ స్థాయిల్లోని ప్రభుత్వ ఉద్యోగులు అందరూ సర్పంచులు, రాజకీయ నాయకులు మొదలుకొని ప్రభుత్వ ఉన్నతాధికారుల వరకూ నిత్యం ఒత్తిడులు, వడిదుడుకులను, కొంత మంది బ్లాక్ మెయిలింగులను ఎదుర్కొంటూ ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ ఉద్యోగ విధులను నిర్వర్తించడమంటే నిజంగానే కత్తి మీద కర్ర సామేనని ఎమెల్యే వివరించారు. ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం నకు బదిలీపై వచ్చినా ఆ ప్రాంత అభివృద్ధికి ప్రేమాభిమానాలతో అంకిత భావంతో అన్ని గ్రామాల సమానాభివృద్ధికీ ప్రభుత్వ ఉద్యోగులు కృషి చేస్తారే తప్ప ఈ ప్రాంతాభివృద్ధికి నేనెందుకు పని చేయాలని భావించరని ఎమ్మెల్యే పేర్కొన్నారు.  ఈ ఉద్యోగ విరమణ ఆత్మీయ వీడ్కోలు పౌర సన్మాన సభలో శంఖవరం మండల తాహసిల్దార్ కర్నాసుల సుబ్రహ్మణ్యం, కాకినాడ డిసిసిబి డైరెక్టర్ పులి మధు, రౌతులపూడి తాహసిల్దార్ కార్యాలయ ఉప తాహసిల్దార్ పివివి.సత్యనారాయణ, రెవెన్యూ ఇనస్పెక్టర్ కరీముల్లా, కంప్యూటర్ ఆపరేటర్ కట్టు రాజ్ కుమార్, మండలంలోని 26 పంచాయితీల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, స్థానిక, స్థానికేతర జిల్లాల నుంచి పలువురు అతిధులు, ఆహ్వానితులు పాల్గొన్నారు.
సిఫార్సు