గ్రామ సచివాలయం సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమ శిక్షణా చర్యలు తీసుకుంటామని సమీకృత గిరిజనాభివృధ్ది సంస్ధ ప్రాజెక్టు అధికారి గోపాల క్రిష్ణ రోణంకి హెచ్చరించారు. పాడేరు మండలం చింతల వీధి గ్రామ సచివాలయాన్ని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయం రికార్డులను పరిశీలించారు. సిబ్బది హాజరు పట్టీ తనిఖీ చేసారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ పి. అనిల్ కుమార్ , డిజిటల్ అసిస్టెంటు బి.మహేశ్వరమ్మ విధులకు హాజరు కాలేదని హెచ్ ఆర్ ఎం ఎస్ లో సెలవు నమోదు చేయలేదని గుర్తించి మెమో జారీ చేయాలని ఎంపిడిఓ ను ఆదేశించారు. మహిళా పోలీస్ కె.నూకరత్నం మూవ్‌మెంట్ రిజిష్టర్ నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. సిబ్బంది క్షేత్ర పర్యటనకు వెళ్లినపుడు విధిగా మూవ్‌మెంట్ రిజిష్టరులో నమోదు చేయాలని ఆదేశించారు. గ్రామ సచివాలయం సిబ్బంది గ్రామస్తులకు అందుబాటులో ఉంటు ప్రతీ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామంలో పారిశుధ్ధ్య మెరుగు పరచాలని ఎంపిడిఓను ఆదేశించారు. పారిశుధ్ద్యపు పనులు నిర్వహంచి సంబంధిత ఫోటోలు,తీసుకున్న చర్యలపై నివేధించాలన్నారు. నిర్మాణంలో ఉన్న గ్రామ సచివాలయం భవనాన్ని ఈనెల 16 వతేదీనాటికి పూర్తి చేయాలని గిరిజన సంక్షేమశాఖ కార్యానిర్వహాక ఇంజనీర్ కెవి ఎస్ ఎన్ కుమార్ ను ఆదేశించారు.