స్పందన అర్జీలకు సత్వర పరిష్కారం..


Ens Balu
4
Narsipatnam
2021-08-02 14:42:18

స్పందన లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి త్వరిత గతిన పరిష్కరించాలని నర్సీప ట్నం ఇంఛార్జి ఆర్ డీ వో అనిత సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్య క్రమాన్ని నిర్వహించారు.డివిజన్ స్థాయిలో గల పలు మండలాల నుండి ప్రజలు వచ్చి తమ సమస్యలను ఆర్ డీ వో కు విన్నవించుకొన్నారు. ఈ సందర్భంగా ఆర్ డీ వోమాట్లాడుతూ ఫిర్యాదు దారుల సమస్యలనుపరిష్కరించడానికే స్పందన కార్యక్రమాన్ని పెట్టడం జరిగిందని, పిటిషన్లు ను సంబంధిత శాఖల అధికారులకు  పరిశీలనా నిమిత్తం పంపి సత్వర పరిష్కారం చేయడానికి ఆదేశించడం జరుగుతుందన్నారు. నేడు స్పందన లో ఎక్కువగా భూ సంబంధిత సమస్యలపై రాగా, రేషన్ కార్డులు,హౌసింగ్ కు సంబంధించి దరఖాస్తులు వచ్చాయన్నారు. 23  ఫిర్యాదులను అందుకోవడం జరిగిందన్నారు.  రావికమతం మండలం గర్నికం గ్రామానికి చెందిన పల్లెల సత్యనారాయణ తన ఫిర్యాదులో పాస్ పుస్తకం ఖాతా నెంబరు మార్చాలిసిందిగా కోరారు.  రావికమతం మండలం గర్ణికం గ్రామానికి చెందిన వెలంకాయల కాసులమ్మ  సర్వే నెం.124/15 లో 35 సెంట్ల భూమిని తప్పుగా రిజిస్ట్రేషన్ చేశారని, సర్వే నం.ను మార్చాల్సిిందిగా కోరారు.  గొలుగొండ మండలం పాకాలపాడు గ్రామం రాజాన సూర్యనారాయణ వ్యవసాయ కూలీ పని చేసుకుంటున్నామని 60 సంవత్సరాల క్రితం గ్రామ కంఠం భూమిలో తాటాకుల ఇల్లు కట్టుకొని నివశిస్తున్నామని, ప్రస్తుతం అది పాడుపడిపోయిందని,దాని స్థానంలో మిద్దె ఇల్లు కట్టుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు.  స్పందన కార్యక్రమంలో మండల తహశీల్దార్ జయ, ఆర్ డీ వో కార్యాలయ అధికారులు హాజరయ్యారు.
సిఫార్సు