సచివాలయాలను తనిఖీచేసిన ఎంపీడీఓ


Ens Balu
3
Sankhavaram
2021-08-02 16:16:05

ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామ సచివాలయ సిబ్బంది పనిచేయాలని ఎంపీడీఓ జె.రాంబాబు సూచించారు. సోమవారం శంఖవరం మండల కేంద్రంలోని మూడు గ్రామ సచివాలయాలను ఆయన తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం గ్రామస్థాయిలోనే ప్రజలకు సేవలు అందించడానికి వీటిని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని ఎవరూ మరువకూడదన్నారు. అనంతరం సచివాలయాల తనిఖీ కోసం రూపొందించిన ఆన్ లైన్ ఫార్మాట్ ఆధారంగా సిబ్బంది రికార్డులను తనిఖీ చేశారు. సచివాలయాల్లో మరికొన్ని మౌళిక వసతుల లేమిని ఎంపీడీఓ గుర్తించారు. ప్రతీఒక్కరూ బయోమెట్రిక్ వేయడంతోపాటు, సచివాలయ కార్యదర్శి దగ్గర నుంచి ప్రతీ ఒక్కరూ డ్యూటీ డైరీ తప్పని సరిగా రాయాలన్నారు. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదన్నారు. ఏ అధికారి సచివాలయ తనిఖీకి వచ్చినా అన్ని శాఖల సిబ్బంది కార్యాలయంలో అందుబాటులో ఉండి రికార్డులను సమర్పించాల్సి వుంటుందన్నారు. ఖచ్చితంగా మూమెంట్ రిజిస్టర్ లో టూర్ వివరాలు నమోదు చేయాలన్నారు. ప్రతీరోజూ స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నదీ లేనిది ఎంపీడీఓ అడిగి తెలుసుకున్నారు. రెవిన్యూ, సర్వే, వ్యవసాయశాఖ సిబ్బంది సచివాలయంలో ఎంపీడీఓ వచ్చేసరికి లేకపోవడంతో కారణాలను తెలియజేస్తూ తనను కార్యాలయంలో కలవాలని కార్యదర్శి శ్రీరామచంద్రమూర్తిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ జూనియర్ సహాయకులు రమణమూర్తి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్రీనివాస్, డిజిటల్ అసిస్టెంట్ జనార్ధన్, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, వెల్పేర్ సహాయకులు దివాకర్, తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు