సర్వీసు రెగ్యులర్ పరీక్షకు సిద్ధంకండి..
Ens Balu
6
Sankhavaram
2021-08-02 16:33:36
గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న అందరు సిబ్బంది ప్రొబేషన్ తరువాత సర్వీసులను రెగ్యులర్ చేయడానికి ప్రభుత్వం నిర్వహించనున్న ప్రత్యేక పరీక్షకు సచివాలయ సిబ్బంది సిద్దం కావాలని ఎంపీడీఓ జె.రాంబాబు సూచించారు. సోమవారం శంఖవరం మండల కేంద్రంలోని సచివాలయం-1లో ఆయన సిబ్బందితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ, అక్టోబర్ 2 నాటికి సచివాలయాలు ఏర్పాటై రెండేళ్లు పూర్తవుతుందని, ఆ మేరకు ప్రభుత్వం ఉద్యోగులందరికీ పెట్టే పరీక్షలో ఉత్తీర్ణులు కావడానికి సిబ్బంది శ్రమించాలన్నారు. ఇప్పటి వరకూ సిబ్బంది గ్రామ స్థాయిలో మంచి సేవలు అందిస్తున్నారని, ఆ పరీక్ష పాసైతే సర్వీసు రెగ్యులర్ అవుతుందని అన్నారు. ఈ మేరకు ఏఏ శాఖల సిబ్బందికి ఏ రకమైన సిలబస్ ప్రభుత్వం ఆన్ లైన్ లో అందుబాటులో పెట్టిందో ప్రత్యేకంగా తెలుసుకున్నారు. ఒక్కో శాఖ సిబ్బందితో ఈ పరీక్ష విషయమై చర్చిస్తూ పలు కీలక సూచనలు చేశారు. ఇప్పటికీ ప్రభుత్వం కొంత శిక్షణ ఇచ్చిందనీ, ఆపై మెటీరియల్ అందుబాటులోకి తెచ్చిందనీ. వీటిని కష్టపడి చదువుకుంటే ప్రతీ ఒక్కరూ పరీక్షలో ఉత్తీర్ణులవుతారని సూచించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ జూనియర్ సహాయకులు రమణమూర్తి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్రీనివాస్, డిజిటల్ అసిస్టెంట్ జనార్ధన్, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, వెల్పేర్ సహాయకులు దివాకర్, తదితరులు పాల్గొన్నారు.