లంకం గ్రామ సచివాలయం ప్రారంభం..
Ens Balu
8
లంకం
2021-08-03 14:13:53
సచివాలయ సేవలు సద్వినియోగం చేసుకోవాలని శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. లంకం గ్రామంలో రూ. 25 లక్షలతో నిర్మించిన నూతన సచివాలయ భవనాన్ని మంగళవారం శాసనసభ్యులు ప్రసాదరావు మంళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అట్టడుగున ఉన్న పేద వర్గాలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను తెచ్చారన్నారు. ఈ లక్ష్య సాధన కోసం ప్రతి ఒక్క ఉద్యోగి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. కస్టమ్ హైరింగ్ సెంటర్ ( సి.హెచ్.సి ) మొదటి ఫేస్ లో 2.5 లక్షలతో ముల్టి గ్రైన్ క్రషర్ , రూ.1.75 లక్షలతో ప్యాడి రెపర్, రూ.35 వేలతో కల్టీ వేటర్ యంత్రాలను అయ్యప్ప రైతు మిత్ర గ్రూప్ కి ధర్మాన అందజేశారు. వాటికి 40 శాతం సబ్సిడీ, 50 శాతం రుణం, 10 శాతం రైతు వాటాగా అందజేయడం జరుగుతుంది. సచివాలయం ప్రాంగణంలో ధర్మాన మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఎంపిడివో అర్.వి.రామన్, ఏమ్మార్వో వెంకటరావు, వ్యవసాయ అధికారి పద్మావతీ, సర్పంచ్ చిట్టి లలిత రవికుమార్, మాజీ ఎంపిపి అంబటి శ్రీనివాస్ రావు, ఏఎంసీ చైర్మన్ ముకళ్ల తాత బాబు, మాజీ జెడ్పిటిసి సభ్యులు చిట్టి జనార్ధన, సర్పంచ్ గెదల చాంగల్ రావు, అల్లు లక్ష్మీనారాయణ, చిట్టి రవికుమార్, యజ్జల గురుమూర్తి, గోండు కృష్ణ, చిట్టి లక్ష్మణ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.