పాడేరు ఘాట్ రోడ్ లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని జాగ్రత్తగా వాహనాలు నడపాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాలకృష్ణ తెలిపారు. బుధవారం స్థానిక ఆర్టీసీ డిపోలో నూతనముగా డ్రైవింగ్ శిక్షణకు వచ్చిన 16 మంది డ్రైవర్లను ఉద్దేశించి ప్రాజెక్టు అధికారి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పానీయాలు సేవించి వాహనాలు నడిపే రాదని, నిద్ర లేకుండా కూడా నడుపరాదని తెలిపారు. తెల్లవారుజామున ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. వాహనాలు ఓవర్టేక్ చేయు సందర్భంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి కనుక ప్రతి ఒక్కరు ఓవర్టేక్ చేసినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అంతకుముందు ప్రాజెక్టు అధికారి డిపో ఆవరణలో మామిడి మొక్కను నాటారు. అనంతరం నూతనముగా 16 మందికి శిక్షణనిచ్చు ఆర్టీసీ బస్సును జండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ రోణంకి సీతారామ నాయుడు , మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కెవియస్ఎన్ రాజు,డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎస్ ఉషశ్రీ,, అసోసియేషన్ ప్రతినిధులు, గ్యారేజ్ సిబ్బంది మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.